ముఖం మీద ఉమ్మేసినా తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు తెలంగాణ కోసం రాజీనామాలు చేసేలా కనిపించడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం అన్నారు. తెలంగాణ వాళ్లను పాఠశాలలు పెట్టుకొని కూడా బతకనివ్వరా అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడ్డాక విద్యాసంస్థలకు వీలైనన్ని ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం సాధించి తీరాలన్నారు. అనుకోని పరిస్థితులు ఏర్పడి తెలంగాణ రాకుంటే తెలంగాణ ప్రజల బతుకులు దారుణంగా ఉంటుందన్నారు.
మనల్ని ఆంధ్రా పెట్టుబడిదారులు ఏ రంగంలోనూ బతకనివ్వరన్నారు. తెలంగాణ వస్తేనే దోపిడీ ఆగిపోతుందన్నారు. సందర్భం ఏదైనా అందరం ఒకటిగా కలిసి ఉండాలని సూచించారు. రాజకీయంగా కూడా అందరూ ఏకం కావాలన్నారు. సకల జనుల సమ్మెకు అందరూ మద్దతు ఇవ్వాలన్నారు. సకల జనుల సమ్మెలో విద్యాసంస్థలు కూడా పాల్గొనాలని సూచించారు
No comments:
Post a Comment