JAI TELANGANA

JAI TELANGANA
"PORADITHE POYEDEMI LEDU BANISA SANKELU TAPPA ANDUKE PORADI TELANGANA SADIDAM ATMAHATYALA THO KADU" JAI TELANGANA! JAI JAI TELANGANA!!

T-News

Thursday 8 September 2011

లక్ష్యం తెలంగాణ

- సకల జనుల సమ్మెకు మద్దతుగా నిరసనలు
- ప్రజావూపతినిధుల దిష్టిబొమ్మలకు ఉరి
- రాజీనామా చేయాలని తెలంగాణవాదుల డిమాండ్
- నేతల పోస్టర్లతో ర్యాలీలు, ధర్నాలు

Rayli-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
 ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు, తెలంగాణవాదులు చేపట్టనున్న సకల జనుల సమ్మెకు మద్దతుగా బుధవారం రాజకీయ, ఉద్యోగ, న్యాయవాద, విద్యార్థి జేఏసీ, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో తెలంగాణ వాదులు ర్యాలీలు, దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ప్రజావూపతినిధులు రాజీనామా చేసి ఉద్యమంలో కలిసి రావాలని డిమాండ్ చేశారు. పలుచోట్ల ప్రజావూపతినిధుల దిష్టిబొమ్మకు ఉరి వేసి అనంతరం దహనం చేశారు. ఓ పక్క తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెబుతూనే మరోపక్క అధికారిక కార్యక్షికమాల్లో పాల్గొనడం నేతల నైజాన్ని తెలియజేస్తోందని ఆరోపించారు.

రంగాడ్డి జిల్లాలో చేపట్టిన నిరసన ర్యాలీలో తూర్పు జిల్లా జేఏసీ అధ్యక్షుడు చెల్మాడ్డి, నియోజకవర్గం ఉద్యోగ జేఏసీ కన్వీనర్ అశోక్‌కుమార్, ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు, టీఆర్‌ఎస్, జేఏసీ, న్యాయవాదులు పాల్గొన్నారు. తాండూరులో సకల జనుల సమ్మెకు మద్దతుగా టీఆర్‌ఎస్, పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యం లో జైపాల్‌డ్డి, సబితాడ్డి, తాండూరు ఎమ్మెల్యే మహేందర్‌డ్డి దిష్టిబొమ్మలకు చెప్పుల దండలు వేసి నిరసన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో జేఏసీ నాయకులు, అఖిల పక్ష నాయకు లు ఎమ్మెల్యే మహేశ్వర్‌డ్డి దిష్టిబొమ్మను ఉరితీశారు. నేరడిగొండలో రాజీనామా లు చేయని ప్రజావూపతినిధుల దిష్టిబొమ్మలను దహనం చేశారు.
adb-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
బోథ్‌లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్షికమాలు చేపట్టారు. మంచిర్యాలలో ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లోని పాతబస్టాం డ్ నుంచి రాజీవ్‌చౌరస్తా వర కు టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నాగరాజు, పట్టణ అధ్యక్షుడు నందుల ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేల దిష్టిబొమ్మల శవయాత్ర నిర్వహించారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌ను టీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే అనుచరులకు టీఆర్‌ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. జిల్లా వ్యాప్తంగా సకల జనుల సమ్మెకు మద్దతుగా ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. నల్లగొండలో రాజీనామా చేయని నేతలు గ్రామాలకు రావొద్దంటూ ఆందోళన చేపట్టారు. నల్లగొండలో జేఏసీ ఆధ్వర్యంలో రాజీనామా చేయని నేతలకు సంబంధించిన పోస్టర్లతో నిరసన వ్యక్తం చేశారు.

గడియారం సెంటర్‌లో పెద్ద పెట్టున నిరసనలు తెలిపి నేతలు గ్రామాలకు రావొద్దని, వస్తే అడ్డుకుంటామంటూ హెచ్చరించారు. భువనగిరిలో కూడా రాజీనామాలు చేయని నేతలు గ్రామాలకు రావొద్దంటూ నిరసనలు తెలిపారు. మెదక్ జిల్లాలోని పలుచోట్ల తెలంగాణ వాదులు ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహించారు. పటాన్‌చెరులో సమ్మెకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. దుబ్బాకలో చెరుకు ముత్యండ్డి దిష్టిబొమ్మను ఉరేసి ఆందోళన చేశారు. కల్హేర్ మండలం బీబీపేట, అల్లాదుర్గం మండలం కెరూరులో ప్రజావూపతినిధుల దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. జిహీరాబాద్‌లో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నిజామాబాద్‌లో తెలంగాణవాదులు ప్రజావూపతినిధుల దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మలతో ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించి దహనం చేసి నిరసన తెలిపారు.

No comments:

Post a Comment