JAI TELANGANA

JAI TELANGANA
"PORADITHE POYEDEMI LEDU BANISA SANKELU TAPPA ANDUKE PORADI TELANGANA SADIDAM ATMAHATYALA THO KADU" JAI TELANGANA! JAI JAI TELANGANA!!

T-News

Friday 2 September 2011

నాదెండ్ల మీరు స్పీకరా.. లేక సీమాంధ్ర బ్రోకరా??




మిస్టర్‌ నాదెండ్ల మనోహర్‌రావు.. మీరు స్పీకరా లేక సీమాంధ్ర బ్రోకరా.. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్నది నక్సలైట్లా.. సిగ్గులేదా చెప్పడానికి.. నీది నోరా మోరా? నీకున్నది నాలుకా.. తాటిమట్టా... సిగ్గుషరం లేకుండా అబద్దాలాడుతవా.. అని తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు.
తెలంగాణ ఉద్యమాన్ని నక్సల్స్ వెనకుండి నడిపిస్తున్నారట. పోరాటం ఇలాగే కొనసాగితే 1969లాగే ఇప్పడు కూడా నక్సలైట్లు పుట్టుకొస్తారట. స్పీకర్ నాదెండ్ల మనోహర్ రావు యూఎస్‌ కాన్సులేట్‌ అధికారులకు చెప్పిన మాటలివి..నాదెండ్ల బ్రోకర్‌ మాటలను వికీలీక్స్ కేబుల్స్ బైటపెట్టింది. స్పీకర్ చెప్పిన విషయాలన్నీ కాన్సులేట్ అధికారులు యూఎస్కు నివేదిక రూపంలో పంపారని వికీలీక్స్ చెప్పింది. తెలంగాణ ఉద్యమంపై యూఎస్‌ కౌన్సిల్‌ జనరల్ కార్నెలిస్‌ ఎం క్యూర్‌తో చెప్పిన మాటల్ని వికీలీక్స్‌ బయటపెట్టింది.
 గత ఉద్యమాల్లో పాల్గొన్న నాయకులు ఆ తరువాత నక్సలైట్ లీడర్లుగా ఎదిగారని... వారంతా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు మద్దతిచ్చి ప్రజల సానుభూతి పొందారని నాదెండ్ల కాన్సులేట్‌ అధికారితో అన్నట్లు వికిలీక్స్‌ బయటపెట్టింది.
ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగ వర్గానికి చెందిన విద్యార్థి నాయకులు ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నరని.. వాళ్లంతా 30ఏళ్లు పైబడిన వారేనని మనోహర్‌ చెప్పినట్టు వికీలీక్స్‌ పేర్కొంది. ఒక విద్యా సంవత్సరం పాడైనా పర్వాలేదని వాళ్లు విద్యార్థుల్ని రెచ్చగొడుతున్నారని స్పీకర్‌ అన్నట్టు వికీలీక్స్‌ వెల్లడించింది. ఉద్యమం ముసుగులో మావోయిస్టు రిక్రూట్‌మెంట్‌ క్యాంపెయిన్‌ విజయవంతంగా జరుపుతున్నదని నాదెండ్ల యూఎస్‌ కాన్సులేట్‌తో చెప్పినట్టు వికీలీక్స్‌ కేబుల్స్‌ బయటపెట్టింది.
స్పీకర్‌ మనోహర్‌ రావు మాత్రం తాను విధినిర్వహణలో భాగంగా కాన్సులేట్‌ అధికారులతో మాట్లాడిన్నని అన్నరు. కానీ తెలంగాణ గురించి మాట్లాడినట్టు గుర్తుకులేదట. స్పీకర్‌ తీరుపై తెలంగాణవాదులు భగ్గుమంటున్నరు. మాదిగల మీద అడ్డదిడ్డంగా మాట్లాడిన మనోహర్‌రావుపై ఎస్సీఎస్టీ ఎట్రాసిటీ కేసుపెట్టి అరెస్టు్‌ చేయాలని దళిత బహుజన నాయకులు డిమాండ్‌ చేస్తున్నరు.
by
(తెలంగాణ శ్రీనివాస్‌)
http://www.porutelangana.com/topstories.php?id=260

No comments:

Post a Comment