తెలంగాణ కోసం, జగన్ కోసం ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తీరు గుర్రానికి, గాడిదకు ఉన్నంత తేడా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా గోదావరిఖని, ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం రాజకీయ ప్రక్రియలో భాగమని, జగన్ కోసం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం అవినీతి, కుంభకోణాలను ప్రోత్సహించడమేనని అభివూపాయపడ్డారు.
రెండింటినీ ఒకే విధంగా పోల్చడం సరికాదన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన అడ్డంకి అని ధ్వజమెత్తారు. మంత్రులకు తెలంగాణ రావడం ఇష్టం లేదని, పైకి మాత్రం కావాలని అంటున్నారని ఆరోపించారు. దొంగచాటుగా విధులు నిర్వర్తించడమే దీనికి నిదర్శమన్నారు. 2004లో టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్నప్పటి నుంచి ప్రత్యేక రాష్ట్రాన్నిఏర్పాటు చేయకుండా కాంగ్రెస్ కాలయాపన చేస్తోందని, పచ్చి అవకాశవాద వైఖరి అవలంభిస్తోందని మండిపడ్డారు. ఏదో ఒక సాకు చెప్పి తెలంగాణ విషయాన్ని వాయిదా వేస్తున్నారని, అవినీతి, కుంభకోణాలు మాత్రం ఏ అడ్డూలేకుండా చేస్తూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. అణుఒప్పందంపై కేంద్రం మైనార్టీలో ఉన్నప్పటికీ తీర్మానం నెగ్గించుకుందని, తెలంగాణను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర సాధనలో సీపీఐ ముందువరుసలో ఉందని, భవిష్యత్‌లోనూ ఉంటుందని చెప్పారు.
సకల జనుల సమ్మెకు మద్దతుగా ఇప్పటికే కార్యక్షికమాలు చేపట్టామని, సింగరేణిలో సమ్మెను ఏ విధంగా ముందుకు తీసుకు విషయంలో చర్చిస్తున్నట్లు చెప్పారు. జేఏసీతో, గద్దర్, కోదండరాంలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. సకల జనుల సమ్మెకు మద్దతు ఉంటుందని ప్రకటించారు.
ఆస్తులు ప్రకటించాలని బాబును ఎవరడిగారు?
రాజకీయ, కార్పొరేట్ అవినీతి బయటకు రాకుండా బూర్జువా పార్టీలు అడ్డుపడుతున్నాయని, ప్రజల దృష్టిని మరల్చడానికే నాయకులు ఆస్తులను ప్రకటిస్తున్నారని విమర్శించారు. రాజకీయాల అక్రమంగా సంపాదించిన ₹73లక్షల కోట్లను స్విస్‌బ్యాంకుల్లో దాచుకున్నారని ఆరోపించారు. గంగిగోవుగా పేరొందిన ప్రధాని మన్మోహన్‌సింగ్ హాయంలోనే 2జీ స్ప్రెక్ట్రమ్, అదర్శ్, కామన్ కుంభకోణాల్లో ₹3లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. అవినీతిపై పోరాటం పేరుతో ప్రజల్లోకి వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును ఆస్తులను ప్రకటించాలని, ఎవరు అడిగారని ప్రశ్నించారు. అవినీతి ఆంశాన్ని పక్కదోవ పట్టించడానికే ఆస్తులు ప్రకటించారని ఎద్దేవా చేశారు. ప్రజావూపతినిధులు ప్రకటించిన ఆస్తులకు 60 రెట్లు అధికంగా చేసుకొని చదువుకోవాలన్నారు.
ఎప్పుడో 1983లో ₹90వేలతో హైదరాబాద్, తిరుపతిలలో తాను కోనుగోలు చేసిన రెండు స్థలాలు ప్రస్తుతం ₹65లక్షలకు చేరుకున్నాయని చెప్పారు. చంద్రబాబు తన ఆస్తుల వివరాల్లో ప్రస్తుత విలువ కాకుండా ఎప్పుడో ఉన్న విలువ ₹ 50 కోట్లుగా చూపించారని, వాస్తవానికి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఎంత ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. 90వేల పెట్టుబడి పెడితే తన విలువ ప్రస్తుతం 65 రెట్లు పెరిగిందని, ఈ లెక్కన బాబు ₹50కోట్లు పెట్టుబడి పెడితే 50ట్లు పెరిగి ప్రస్తుతం అతని ఆస్తులు ₹2500 కోట్ల వరకు ఉంటాయని వివరించారు. నాలుగేళ్ల కిందట ₹2కోట్ల ఆదాయపు పన్ను చెల్లించిన జగన్ ఇప్పుడు ₹400కోట్లు ఎలా చెల్లిస్తున్నాడు? అక్రమంగా సంపాదించడానేందుకు ఇంతకన్నా నిదర్శనం ఏకం కావాలని ప్రశ్నించారు.
అవినీతికి పాల్పడిన వారికి నార్కోఅనాలిసిస్ పరీక్ష చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని, పరీక్ష తాను కూడా సిద్ధమని ప్రకటించారు. సమావేశంలో సీపీఐ శాసన సభా పక్ష నేత గుండా మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటడ్డి, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య,సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి,బద్రి సత్యనారాయణ, కలవేన శంకర్, మల్లాడ్డి, వీరభవూదయ్య, ఖలేందర్‌ఖాన్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment