- జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతూ చితకబాదారు - కోర్టులో హాజరుపర్చాలన్న పాపానికి జిల్లా జాక్ చైర్మన్ పాపిరెడ్డి, టీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి, మరో నాయకుడు ఇండ్ల నాగేశ్వరరావు అరెస్టు వరంగల్‌లో ఖాకీస్వామ్యం పడగవిప్పి బుసకొట్టింది. మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటిని ముట్టడించి, కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ఫ్లెక్సీని చించివేశారనే నెపంతో కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థి నేతలపైనా, విద్యార్థులపైనా పోలీసులు తమ ప్రతాపాన్ని చూపారు. మంత్రి ఇంటిపై విద్యార్థులు దాడి చేశారనే కారణంగా కేయూ విద్యార్థుల్ని జిల్లాలోని దాదాపు అన్ని పోలీసు స్టేషన్లు తిప్పుతూ చితకబాదుతున్నారు. విద్యార్థుల్ని కోర్టులో ప్రవేశపెట్టాలని కోరేందుకు వెళుతోన్న జిల్లా రాజకీయ జేఏసీ ప్రొఫెసర్ పాపిడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌డ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఇండ్ల నాగేశ్వరరావును రఘునాథపల్లి పోలీసు స్టేషన్‌లో అరెస్టు చేశారు. విద్యార్థుల్ని కోర్టులో ప్రవేశపెట్టకుండా పోలీసులు అరాచకంగా వ్యవహరిస్తున్నారని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో అత్యంత ఉద్రిక్తంగా, తెలంగాణ కోసం ఉద్యమించే వారిపై ఉక్కుపాదం మోపేందుకే సర్కారు కుట్రచేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సకల జనుల సమ్మెలో భాగంగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కేయూ జేఏసీ, జిల్లా విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు మంగళవారం హన్మకొండ రాంనగర్‌లోని మంత్రి పొన్నాల ల ్మయ్య ఇంటిని ముట్టడించారు. విద్యార్థులు మంత్రి ఇంటి ఎదుట ై ఠాయించి చెప్పులు, బూట్లతో నిరసన తెలిపారు. తన మంత్రి పదవికి రాజీనామా చేసి సకల జనుల సమ్మెలో కలిసిరావాలని డిమాండ్ చేశారు. అక్కడ బందోబస్తు నిర్తహిస్తున్న పోలీసుల కళ్లుగప్పిన కొందరు విద్యార్థులు మంత్రి ఇంట్లోకి దూసుకెళ్లి సోనియా ఫొటోఫ్లెక్సీని ధ్వంసం చేశారు. అలాగే ఇంటిపైకి రాళ్లు రువ్వి అద్దాలు పగులగొట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం మేరకు హన్మకొండ సీఐ వెంక సుబేదారి సీఐ రణధీర్, ఎసై్స రవికుమార్ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న విద్యార్థులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు విద్యార్థులను ఈడ్చుకెళ్లి జీపులో పడేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనలో 18 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు 12 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. వీరిలో కేయూ జాక్ చైర్మన్ సాధు రాజేష్, విద్యార్ధి నాయకుడు దేవోజీ నాయక్, కొంగర కిషోర్, శ్రీనివాస్‌డ్డి, మనోజ్, ప్రశాంత్, బాలకృష్ణ, అనిల్, కృష్ణ, సమన్, రాంమోహన్‌డ్డి, యాకూబ్‌డ్డి ఉన్నారు. ఠాణాలు చుట్టూ తిప్పుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడాన్ని టీఆర్‌ఎస్ నేతలతో పాటు జేఏసీ, న్యాయవాదులు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు పలువురు సుబేదారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వారిని పరామర్శించారు. విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలని, లేకుంటే తక్షణమే వారిని కోర్టులో హాజరు పర్చాలని డిమాండ్ చేశారు. అరెస్ట్‌ను నిరసిస్తూ కేయూ విద్యార్థి నేతలు ఎస్డీఎల్‌సీఈ ఎదుట మంత్రి పొన్నాల దిష్టిబొమ్మను దహనం చేశారు. కాగా పోలీసులు విద్యార్థులను వైద్యచికిత్సల నిమిత్తం ఎంజీఎంకు తరలిస్తామని నచ్చజెప్పి ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ విషయం టీఆర్‌ఎస్, విద్యార్థి సంఘాల చెవిన పడటంతో వెంటనే వారిని అక్కడ నుంచి జఫర్‌గఢ్ ఠాణాకు తరలించారు. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థులను చిత్రహింసలకు గురిచేసినట్లు తెలిసింది. వారిని విడిపించేందుకు టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌డ్డి, పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ పాపిడ్డి, టీఆర్‌ఎస్ యువజన నేత ఇండ్ల నాగేశ్వర్‌రావు జఫర్‌గఢ్‌కు వెళ్లగా అక్కడి నుంచి వారిని జనగామ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారనే సమాచారంతో వారిని అనుసరించగా ముగ్గురిని రఘునాథపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల్ని మాత్రం జనగామ తీసికెళుతున్నామని చెప్పి అక్కడి నుంచి మొదట లింగాల ఘనపురం అని ఆ తరువాత అక్కడా ఆందోళన జరుగుతోందని భావించి అక్కడి నుంచి దేవరుప్పులకు తరలించారు. అక్కడి నుంచి కొడకండ్ల పోలీసు స్టేషన్‌కు తీసికెళ్లారు. పోలీసుల వైఖరికి నిరసనగా ఓయూ క్యాంపస్‌లో విద్యార్థులు రాత్రి ధర్నా జరిపారు. పొన్నాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల అరెస్టుకు నిరసనగా గురువారం పోలీస్ స్టేన్ల ముట్టడికి పిలుపునిచ్చారు. ప్రజాసంఘాల నిరసన ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన విద్యార్థుల్ని పోలీసులు..నక్సలైట్లను పోలీసు స్టేషన్లు తిప్పినట్టు తిప్పుతూ భయాందోళనకు గురిచేస్తోన్నారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్యను రాజీనామా చేయాలని ముట్టడించే క్రమంలో జరిగిన చిన్నసంఘటనను ఆసరాగా చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం, పొన్నాల లక్ష్మయ్య కావాలని విద్యార్థుల్ని చితకబాదుతున్నారన్నారు. విద్యార్థులకు రక్షణగా వెళుతోన్న తమనూ రఘునాథపల్లి పోలీసు స్టేషన్‌లో అరెస్టు చేయడాన్ని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ పాపిడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌డ్డి, టీఆర్‌ఎస్ యూత్‌నేత ఇండ్ల నాగేశ్వరరావును అరెస్టు చేశారు. ఈ అక్రమంగా అరెస్టు చేసినవారిని తక్షణమే కోర్టులో హాజరుపరచాలని తెలంగాణ ప్రజావూఫంట్ జిల్లా కన్వీనర్ రమాదేవీ, ఎపీసీఎల్‌సీ నేత అంబటి శ్రీనివాస్, రాష్ట్రబార్ కౌన్సిల్ మెంబర్ ఎం. సహోదరడ్డి, జిల్లా బార్ అధ్యక్షుడు రావు అమరేందర్‌డ్డి, టఫ్ బాధ్యులు ఎండి రియాజ్ సహా పలువురు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు క్షేమంగానే ఉన్నారు: జిల్లా ఎస్పీ తెలంగాణ ఉద్యమాన్ని ఆసరాచేసుకొని కొంతమంది క్రిమినల్ మెంటాలిటీతో విధ్వంసం చేయాలని చూస్తున్నారని, అటువంటి వారినే తాము అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ రాజేశ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం వారంతా తమ కస్టడీలో క్షేమంగా ఉన్నారని వారిని కోర్టులో ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. అయితే ఈ కేసులో మంత్రి పొన్నాల లక్ష్మయ్యకానీ, ఆయన అనుచరులు కానీ ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, తామే సూమోటాగా కేసు నమోదు చేశామనీ ఆయన స్పష్టం చేశారు. అరెస్ట్ చేయడం తగదు: మల్లేపల్లి లక్ష్మయ్య మంత్రి పొన్నాల ఇంటివద్ద ఆందోళన చేసినందుకు విద్యార్థులను అరెస్ట్ చేయడం తగదని రాజకీయ జేఏసీ కో- చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. తెలంగాణలో పుట్టి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పదవులకు రాజీనామా చేయాలని కోరితే అరెస్ట్ చేస్తారా? అని మండిపడ్డారు. విమలక్క ఖండన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలోకి రావల్సిందిగా కేయూ విద్యార్థులు మంత్రి పొన్నాల ఇంటివద్ద ఆందోళన చేయడం ప్రజాస్వామ్యయుతమేనని, వారిని అరెస్టు చేసి, దమనకాండ సాగించడం ప్రజాస్వామ్యం కాదని తెలంగాణ ఐక్య వేదిక నాయకురాలు విమలక్క అన్నారు. కేయూ విద్యార్థులను పోలీసులు ఠాణాలు తిప్పుతూ గొడ్లను కొట్టినట్టు కొట్టడాన్ని ఖండించారు. |
“ప్రజలారా ! తెలంగాణ రాష్ట్రం వస్తే తప్పమన నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు,బొగ్గు, భూమి తదితర వనరులు మనకు దక్కవు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులోతక్షణమే బిల్లు పెట్టమని డిమాండ్ చేద్దాం. తెలంగాణ వ్యాప్తంగా ఊరేగింపులు, ధర్నాలు,సదస్సులు జరిపి ప్రబుత్వస్ని నిలదీద్దాం.తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజల జన్మ హక్కు అని ప్రకటిద్దాం
JAI TELANGANA
T-News
Wednesday, 7 September 2011
వరంగల్‌లో మంత్రి పొన్నాల ఇంటిని ముట్టడించిన కేయూ విద్యార్థులు - రెచ్చిపోయిన పోలీసులు.. 18 మందిపై కేసులు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment