- ర్యాలీలు, ధర్నాలు రాస్తారోకోలు - కలెక్టర్, జేసీల డ్రైవర్లు సమ్మెలోనే... - అటెండర్ నుంచి గెజిటెడ్ వరకు అందరిది సమ్మె బాటే :సకల జనుల సమ్మె మంగళవారం గ్రేటర్ హైదరాబాద్‌లో విజయవంతమైంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ జేఏసీ ఇచ్చిన పిలుపుతో గ్రేటర్ పరిధిలోని 63 శాఖలకు చెందిన 80వేల మంది ఉద్యోగులు మొదటి రోజు సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. టీఎన్‌జీవోల సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎన్‌బీ.కృష్ణాయాదవ్, కార్యదర్శి హరిబాబు, సిటీ కేంద్ర కమిటీ అధ్యక్షురాలు రంజన, కార్యదర్శి వెంక రంగాడ్డి జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, కార్యదర్శి రాంమోహన్ మంగళవారం ఉదయం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను పర్యటిస్తూ సమ్మెను పరిశీలించారు. ఉద్యోగులకు వెన్నుదన్నుగా ఉంటామని ధైర్యం చెప్పారు. హైదరాబాద్, రంగాడ్డి జిల్లా కలెక్టర్ల కార్యాలయాలతో పాటు మండల రెవెన్యూ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది విధులు బహిష్కరించి పాలనను స్తంభింపజేశారు. రంగాడ్డి జిల్లా కలెక్టర్, జేసీల వాహన డ్రైవర్లు సమ్మె బాటపట్టడంతో వారు ప్రైవేట్ డ్రైవర్లను ఏర్పాటు చేసుకున్నారు. రంగాడ్డి జిల్లా రిజివూస్టార్ కార్యాలయానికి తాళం వేశారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న గగన్ విహార్ కాంప్లెక్స్ వద్ద వాణిజ్య పన్నుల విభాగం, రెసిడెన్షియల్ పాఠశాలల కమీషనరేట్, శ్రీశైలం ప్రాజెక్ట్, ట్రెజరీ, ఇరిగేషన్, సాంఘిక సంక్షేమ, సహకార, వికలాంగుల సంక్షేమ, భూగర్భజల, సర్వశిక్ష అభియాన్ శాఖలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు విధులను బహిష్కరించి ప్రధాన ద్వారాన్ని మూసివేసి కార్యాలయం ముందు బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు. 170 జీవో కాదు.. 610జీవో అమలు చేయాలని, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని, ఎస్మా, గిస్మా జాంతానై, తెలంగాణ దేనాహై వంటి నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. ఇంజినీర్ల జేఏసీ కన్వీనర్ వెంక నాయకుడు బాల్‌నర్సయ్య, శ్రీధర్ దేశ్‌పాండేల ఆధ్వర్యంలో ఇంజినీర్లు సమ్మెలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కాలనీ వద్ద నీటి పారుదల శాఖ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, వాటర్‌వర్క్స్, జీహెచ్‌ఎంసీ, హౌసింగ్ కార్పోరేషన్, పబ్లిక్ హెల్త్ తదితర విభాగాల్లోని ఉద్యోగులు విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. సచివాలయం, పశువైద్యశాఖ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, ఆర్థిక గణాంకశాఖ, ఇంటర్‌విద్య, వ్యవసాయ విశ్వవిద్యాలయం, విద్యాశాఖ, సివిల్‌సప్లయ్, సబ్‌రిజివూస్టార్, లేబర్, సర్వే ల్యాండ్ రికార్డు, గృహనిర్మాణశాఖ, సిటీ సెంట్రల్ లైబ్రరీ తదితర శాఖలకు చెందిన ఉద్యోగులు ఎక్కడికక్కడ విధులను బహిష్కరించి ధర్నా చేశారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులకు మద్ధతుగా బస్‌భవన్ ముందు ఆర్టీసీ కార్మికులు, పర్యాటక శాఖ ముందు ఆ శాఖ ఉద్యోగులు, జలమండలి ముందు ఆ కార్యాలయాల ముందు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా చేపట్టారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం సమన్వయ కర్త రఘు, మోహన్‌డ్డి, శివాజీల ఆధ్వర్యంలో వందలాది మంది ఉద్యోగులు విద్యుత్ సౌధా ముందు ధర్నా నిర్వహించారు. తెలంగాణ ఉద్యోగులపై ప్రభుత్వ కఠినంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని వారు హెచ్చరించారు. ఈ నెల 19 నుంచి తాము సహాయ నిరాకరణ చేపట్టనున్నామని తెలిపారు. న్యాయవాదుల ఆందోళన సకలజనుల సమ్మెలో భాగంగా ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా నగరంలోని హైకోర్టు, నాంపల్లి, రంగాడ్డి జిల్లా కోర్టులతో పాటు రాజేంవూదనగర్, హయత్‌నగర్, మియాపూర్ కోర్టులకు చెందిన న్యాయవాదులు విధులు బహిష్కరించారు. నాంపల్లి కోర్టు వద్ద జడ్జితో పాటు సీబీఐ అధికారులను అడ్డుకున్నారు. హైకోర్టు న్యాయవాదులు ర్యాలీ నిర్వహించిన అనంతరం మదినా సెంటర్‌లో అరగంటపాటు మానవహారం నిర్వహించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. విద్యాసంస్థల బంద్ తెలంగాణ సాధన కోసం జరుగుతున్న సకల జన సమ్మెకు మద్దతుగా విద్యార్థులు, టీఆర్‌ఎస్, బీజేపీ ప్రజాసంఘాలు ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించాయి. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శులు రాంమూర్తి, రామేష్‌ల ఆధ్వర్యంలో కళాశాలు బహిష్కరించి మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల విద్యార్థులు తరగతులు బహిష్కరించి సంఘీభావంగా ర్యాలీ నిర్వహించారు. సైఫాబాద్ పీజీ కళాశాల, సిటీ కళాశాలల విద్యార్థులు కళాళాల ముందు ధర్నా కార్యక్షికమాన్ని చేపట్టారు. బీజీపీ గన్‌పార్క్ వద్ద ర్యాలీని నిర్వహించింది. మౌలాలిలో జేఏసీ, కుద్బుల్లాపూర్‌లో టీఆర్‌ఎస్ ఇన్‌ఛార్జి రాజు, ఈసీఐఎల్ ఇన్‌ఛార్జి బేతి సుభాస్‌డ్డి, రాజేంవూదనగర్ చౌరస్తాలో టీఆర్‌ఎస్‌ల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఉప్పల్‌లో కళకారులు భారీ ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో దూందాం చేపట్టారు. సచివాలయాన్ని ముట్టడించడానికి టీ టీడీపీ నాయకులు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. హయత్‌నగర్‌లో తెలంగాణ వాదులు సినిమా షూటింగ్‌ను అడ్డుకున్నారు. |
“ప్రజలారా ! తెలంగాణ రాష్ట్రం వస్తే తప్పమన నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు,బొగ్గు, భూమి తదితర వనరులు మనకు దక్కవు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులోతక్షణమే బిల్లు పెట్టమని డిమాండ్ చేద్దాం. తెలంగాణ వ్యాప్తంగా ఊరేగింపులు, ధర్నాలు,సదస్సులు జరిపి ప్రబుత్వస్ని నిలదీద్దాం.తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజల జన్మ హక్కు అని ప్రకటిద్దాం
JAI TELANGANA
T-News
Tuesday, 13 September 2011
‘సకలం’ సక్సెస్ - మొదటి రోజు సమ్మెలో 80 వేల మంది ఉద్యోగులు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment