JAI TELANGANA

JAI TELANGANA
"PORADITHE POYEDEMI LEDU BANISA SANKELU TAPPA ANDUKE PORADI TELANGANA SADIDAM ATMAHATYALA THO KADU" JAI TELANGANA! JAI JAI TELANGANA!!

T-News

Tuesday 13 September 2011

‘సకలం’ సక్సెస్ - మొదటి రోజు సమ్మెలో 80 వేల మంది ఉద్యోగులు


- ర్యాలీలు, ధర్నాలు రాస్తారోకోలు
- కలెక్టర్, జేసీల డ్రైవర్లు సమ్మెలోనే...
- అటెండర్ నుంచి గెజిటెడ్ వరకు అందరిది సమ్మె బాటే

510-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema:సకల జనుల సమ్మె మంగళవారం గ్రేటర్ హైదరాబాద్‌లో విజయవంతమైంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ జేఏసీ ఇచ్చిన పిలుపుతో గ్రేటర్ పరిధిలోని 63 శాఖలకు చెందిన 80వేల మంది ఉద్యోగులు మొదటి రోజు సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. టీఎన్‌జీవోల సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎన్‌బీ.కృష్ణాయాదవ్, కార్యదర్శి హరిబాబు, సిటీ కేంద్ర కమిటీ అధ్యక్షురాలు రంజన, కార్యదర్శి వెంక రంగాడ్డి జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, కార్యదర్శి రాంమోహన్ మంగళవారం ఉదయం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను పర్యటిస్తూ సమ్మెను పరిశీలించారు. ఉద్యోగులకు వెన్నుదన్నుగా ఉంటామని ధైర్యం చెప్పారు. హైదరాబాద్, రంగాడ్డి జిల్లా కలెక్టర్ల కార్యాలయాలతో పాటు మండల రెవెన్యూ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది విధులు బహిష్కరించి పాలనను స్తంభింపజేశారు.

రంగాడ్డి జిల్లా కలెక్టర్, జేసీల వాహన డ్రైవర్లు సమ్మె బాటపట్టడంతో వారు ప్రైవేట్ డ్రైవర్లను ఏర్పాటు చేసుకున్నారు. రంగాడ్డి జిల్లా రిజివూస్టార్ కార్యాలయానికి తాళం వేశారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న గగన్ విహార్ కాంప్లెక్స్ వద్ద వాణిజ్య పన్నుల విభాగం, రెసిడెన్షియల్ పాఠశాలల కమీషనరేట్, శ్రీశైలం ప్రాజెక్ట్, ట్రెజరీ, ఇరిగేషన్, సాంఘిక సంక్షేమ, సహకార, వికలాంగుల సంక్షేమ, భూగర్భజల, సర్వశిక్ష అభియాన్ శాఖలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు విధులను బహిష్కరించి ప్రధాన ద్వారాన్ని మూసివేసి కార్యాలయం ముందు బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు. 170 జీవో కాదు.. 610జీవో అమలు చేయాలని, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని, ఎస్మా, గిస్మా జాంతానై, తెలంగాణ దేనాహై వంటి నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది.

ఇంజినీర్ల జేఏసీ కన్వీనర్ వెంక నాయకుడు బాల్‌నర్సయ్య, శ్రీధర్ దేశ్‌పాండేల ఆధ్వర్యంలో ఇంజినీర్లు సమ్మెలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కాలనీ వద్ద నీటి పారుదల శాఖ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, వాటర్‌వర్క్స్, జీహెచ్‌ఎంసీ, హౌసింగ్ కార్పోరేషన్, పబ్లిక్ హెల్త్ తదితర విభాగాల్లోని ఉద్యోగులు విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. సచివాలయం, పశువైద్యశాఖ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, ఆర్థిక గణాంకశాఖ, ఇంటర్‌విద్య, వ్యవసాయ విశ్వవిద్యాలయం, విద్యాశాఖ, సివిల్‌సప్లయ్, సబ్‌రిజివూస్టార్, లేబర్, సర్వే ల్యాండ్ రికార్డు, గృహనిర్మాణశాఖ, సిటీ సెంట్రల్ లైబ్రరీ తదితర శాఖలకు చెందిన ఉద్యోగులు ఎక్కడికక్కడ విధులను బహిష్కరించి ధర్నా చేశారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులకు మద్ధతుగా బస్‌భవన్ ముందు ఆర్టీసీ కార్మికులు, పర్యాటక శాఖ ముందు ఆ శాఖ ఉద్యోగులు, జలమండలి ముందు ఆ కార్యాలయాల ముందు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా చేపట్టారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం సమన్వయ కర్త రఘు, మోహన్‌డ్డి, శివాజీల ఆధ్వర్యంలో వందలాది మంది ఉద్యోగులు విద్యుత్ సౌధా ముందు ధర్నా నిర్వహించారు.

తెలంగాణ ఉద్యోగులపై ప్రభుత్వ కఠినంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని వారు హెచ్చరించారు. ఈ నెల 19 నుంచి తాము సహాయ నిరాకరణ చేపట్టనున్నామని తెలిపారు.

న్యాయవాదుల ఆందోళన
సకలజనుల సమ్మెలో భాగంగా ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా నగరంలోని హైకోర్టు, నాంపల్లి, రంగాడ్డి జిల్లా కోర్టులతో పాటు రాజేంవూదనగర్, హయత్‌నగర్, మియాపూర్ కోర్టులకు చెందిన న్యాయవాదులు విధులు బహిష్కరించారు. నాంపల్లి కోర్టు వద్ద జడ్జితో పాటు సీబీఐ అధికారులను అడ్డుకున్నారు. హైకోర్టు న్యాయవాదులు ర్యాలీ నిర్వహించిన అనంతరం మదినా సెంటర్‌లో అరగంటపాటు మానవహారం నిర్వహించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.

విద్యాసంస్థల బంద్
తెలంగాణ సాధన కోసం జరుగుతున్న సకల జన సమ్మెకు మద్దతుగా విద్యార్థులు, టీఆర్‌ఎస్, బీజేపీ ప్రజాసంఘాలు ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించాయి. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శులు రాంమూర్తి, రామేష్‌ల ఆధ్వర్యంలో కళాశాలు బహిష్కరించి మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల విద్యార్థులు తరగతులు బహిష్కరించి సంఘీభావంగా ర్యాలీ నిర్వహించారు. సైఫాబాద్ పీజీ కళాశాల, సిటీ కళాశాలల విద్యార్థులు కళాళాల ముందు ధర్నా కార్యక్షికమాన్ని చేపట్టారు. బీజీపీ గన్‌పార్క్ వద్ద ర్యాలీని నిర్వహించింది.

మౌలాలిలో జేఏసీ, కుద్బుల్లాపూర్‌లో టీఆర్‌ఎస్ ఇన్‌ఛార్జి రాజు, ఈసీఐఎల్ ఇన్‌ఛార్జి బేతి సుభాస్‌డ్డి, రాజేంవూదనగర్ చౌరస్తాలో టీఆర్‌ఎస్‌ల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఉప్పల్‌లో కళకారులు భారీ ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో దూందాం చేపట్టారు. సచివాలయాన్ని ముట్టడించడానికి టీ టీడీపీ నాయకులు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. హయత్‌నగర్‌లో తెలంగాణ వాదులు సినిమా షూటింగ్‌ను అడ్డుకున్నారు.

Telangana employees began war


Work in various government offices in all the 10 Telangana districts was completely paralysed as employees boycotted duties as part of the Sakalajanula Samme which began on Tuesday.
Nearly 25,000 employees in Warangal and 30,000 in Karimnagar boycotted their duties in response to the political JAC's indefinite strike call. The employees staged a dharna in front of the collector office at Warangal and locked the office gates.
Protesting students obstructed Warangal superintendent of police Rajesh Kumar at the Arts College in Hanamkonda. They stopped his vehicle and shouted slogans. The students even refused to give way to his vehicle though the SP had to turn back to his office. They demanded the immediate suspension of DSP Venkata Narsaiah.
Doctors boycotted their duties at MGM Hospital. Doctors association president Nagendrababu said if the Centre does not grant Telangana, they would go ahead with an indefinite strike. "We will attend only emergency services," he threatened. All the employees belonging to revenue, education, I&PR, registration and 50 other department staff joined the mass indefinite strike.
Advocates stayed away from the courts as they took out rally from the Adalat junction to the collector office. Bar association members staged protests in front of revenue offices in Karimnagar district. Employees took out rallies at Karimnagar town, while students boycotted classes and formed a human chain at Kaman chowrasta in the town. TNGOs president Hameed monitored the mass strike in the district.
As part of the agitation lawyers in Nizamabad have decided to stay away from the court for eight days. A majority of the private schools were closed in the town. All the government offices in Adilabad district were closed during the day as all the employees stayed away from their duties.
As part of the strike, all sections of people stayed away from work and raised slogans in support of Telangana as they held sit-ins and other forms of protest. "The employees will not cooperate with the government. The state ministers from Telangana region should also participate in the strike," K Vithal, a leader of Telangana employees union said.
TRS leaders organised road blockades in Siddipet in Medak, Nalgonda and Khammam districts. Former minister Jupalli Krishna Rao and Nagarkurnool MP Manda Janganatham faced the wrath of Palamur students when they came to Mahbubnagar to render support to the JAC employees. The students and JAC leaders demanded Manda to submit his resignation first.

Friday 9 September 2011

Banswada Byelection Schedule Announced


The election commission has announced the schedule for Banswada assembly constituency. The notification for this election would be released on 19th September and the election would be held on October 13th.
Banswada seat fell vacant after senior Telugu Desam MLA Pocharam Srinivas Reddy resigned to the party and his MLA post in protest against TDP’s anti-Telangana stand.
Pocharam Srinivas Reddy later joined the Telangana Rashtra Samithi.
It would be interesting to see if TDP and Congress would dare to contest this by-election.
People of Telangana are vexed with the double standards of TDP and Congress and have already taught these two parties a fitting lesson in the 2010 Telangana by-elections. While TDP lost deposits in all the 12 seats it contested, Congress too was battered severely.
So, while Pocharam’s win is guaranteed, the only point of interest is how badly will TDP and Congress lose this election.

Thursday 8 September 2011

లక్ష్యం తెలంగాణ

- సకల జనుల సమ్మెకు మద్దతుగా నిరసనలు
- ప్రజావూపతినిధుల దిష్టిబొమ్మలకు ఉరి
- రాజీనామా చేయాలని తెలంగాణవాదుల డిమాండ్
- నేతల పోస్టర్లతో ర్యాలీలు, ధర్నాలు

Rayli-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
 ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు, తెలంగాణవాదులు చేపట్టనున్న సకల జనుల సమ్మెకు మద్దతుగా బుధవారం రాజకీయ, ఉద్యోగ, న్యాయవాద, విద్యార్థి జేఏసీ, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో తెలంగాణ వాదులు ర్యాలీలు, దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ప్రజావూపతినిధులు రాజీనామా చేసి ఉద్యమంలో కలిసి రావాలని డిమాండ్ చేశారు. పలుచోట్ల ప్రజావూపతినిధుల దిష్టిబొమ్మకు ఉరి వేసి అనంతరం దహనం చేశారు. ఓ పక్క తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెబుతూనే మరోపక్క అధికారిక కార్యక్షికమాల్లో పాల్గొనడం నేతల నైజాన్ని తెలియజేస్తోందని ఆరోపించారు.

రంగాడ్డి జిల్లాలో చేపట్టిన నిరసన ర్యాలీలో తూర్పు జిల్లా జేఏసీ అధ్యక్షుడు చెల్మాడ్డి, నియోజకవర్గం ఉద్యోగ జేఏసీ కన్వీనర్ అశోక్‌కుమార్, ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు, టీఆర్‌ఎస్, జేఏసీ, న్యాయవాదులు పాల్గొన్నారు. తాండూరులో సకల జనుల సమ్మెకు మద్దతుగా టీఆర్‌ఎస్, పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యం లో జైపాల్‌డ్డి, సబితాడ్డి, తాండూరు ఎమ్మెల్యే మహేందర్‌డ్డి దిష్టిబొమ్మలకు చెప్పుల దండలు వేసి నిరసన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో జేఏసీ నాయకులు, అఖిల పక్ష నాయకు లు ఎమ్మెల్యే మహేశ్వర్‌డ్డి దిష్టిబొమ్మను ఉరితీశారు. నేరడిగొండలో రాజీనామా లు చేయని ప్రజావూపతినిధుల దిష్టిబొమ్మలను దహనం చేశారు.
adb-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
బోథ్‌లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్షికమాలు చేపట్టారు. మంచిర్యాలలో ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లోని పాతబస్టాం డ్ నుంచి రాజీవ్‌చౌరస్తా వర కు టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నాగరాజు, పట్టణ అధ్యక్షుడు నందుల ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేల దిష్టిబొమ్మల శవయాత్ర నిర్వహించారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌ను టీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే అనుచరులకు టీఆర్‌ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. జిల్లా వ్యాప్తంగా సకల జనుల సమ్మెకు మద్దతుగా ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. నల్లగొండలో రాజీనామా చేయని నేతలు గ్రామాలకు రావొద్దంటూ ఆందోళన చేపట్టారు. నల్లగొండలో జేఏసీ ఆధ్వర్యంలో రాజీనామా చేయని నేతలకు సంబంధించిన పోస్టర్లతో నిరసన వ్యక్తం చేశారు.

గడియారం సెంటర్‌లో పెద్ద పెట్టున నిరసనలు తెలిపి నేతలు గ్రామాలకు రావొద్దని, వస్తే అడ్డుకుంటామంటూ హెచ్చరించారు. భువనగిరిలో కూడా రాజీనామాలు చేయని నేతలు గ్రామాలకు రావొద్దంటూ నిరసనలు తెలిపారు. మెదక్ జిల్లాలోని పలుచోట్ల తెలంగాణ వాదులు ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహించారు. పటాన్‌చెరులో సమ్మెకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. దుబ్బాకలో చెరుకు ముత్యండ్డి దిష్టిబొమ్మను ఉరేసి ఆందోళన చేశారు. కల్హేర్ మండలం బీబీపేట, అల్లాదుర్గం మండలం కెరూరులో ప్రజావూపతినిధుల దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. జిహీరాబాద్‌లో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నిజామాబాద్‌లో తెలంగాణవాదులు ప్రజావూపతినిధుల దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మలతో ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించి దహనం చేసి నిరసన తెలిపారు.

తెలంగాణ వచ్చినా.. పదవులకు దూరమే-హరీశ్‌రావు



- 12లోగా రాజీనామాలు చేయకుంటే జనంలో తిరగలేరు
- ‘ప్రజాగర్జన’ను విజయవంతం చేయాలి
- టీఆర్‌ఎస్‌వీ సమావేశంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు

 టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులపై సిద్ధిపేట ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత టి. హరీశ్‌రావు నిప్పులుచెరిగారు. తెలంగాణ కోసమే ఉద్యమిస్తున్న కేసీఆర్‌ను విమర్శించే స్థాయి ఆ పార్టీ నేతలకు లేదన్నారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే పదవులకు రాజీనామా చేసి, ఆమోదింపజేసుకోవాలని సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రం వచ్చేవరకూ పదవులకు దూరంగా ఉండడమే కాదు.. తెలంగాణ వచ్చినా పదవులకు దూరంగానే ఉంటామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు బాల్క సుమన్ అధ్యక్షతన బుధవారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జరుగుతున్న ఉద్యమంలో పిల్లలతో పాటు వృద్ధులు కూడా పాల్గొంటున్నారని తెలిపారు. ‘తెలంగాణ వచ్చే వరకూ పదవులకు దూరంగా ఉంటామని ప్రకటనలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి లేదు.’ అని విమర్శించారు. ‘తెలంగాణ కోసం కేసీఆర్ తన ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చే వరకూ కాపాలాకుక్కలా ఉంటానని ప్రకటించారు. అటువంటి ఉద్యమకారుడిని మీరు విమర్శిస్తారా..?’ అంటూ టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ రాష్ట్రం రావాలన్న చిత్తశుద్ధి మీకు ఉంటే, వెంటనే పదవులకు రాజీనామా చేసి, ఆమోదించుకోవాలి.’ అని సవాల్ విసిరారు. తెలంగాణ కోసం ఉద్యమించినందుకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై ఎన్నో కేసులు నమోదయ్యాయని, మీ మీద ఏమైనా కేసులున్నాయా..? అంటూ టీడీపీ ఎమ్మెల్యేలను ఆయన నిలదీశారు.

పదవులు పట్టుకొని వేలాడుతున్న మీరా మాకు నీతులు చెప్పేది అని హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పదవులు లేకుంటే ఒడ్డున పడ్డ చేపలా గిలగిల కొంటుకుంటారని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం మంత్రిగా విధుల్లో పాల్గొంటున్నామని చెప్పిన పంచాయతీరాజ్ మంత్రి జానాడ్డి.. తెలంగాణ ఎవరు తెస్తారో చెప్పాలన్నారు. పంద్రాగస్టు నాడు జాతీయ జెండాలు ఎగిరేసేందుకు ఉరుకులాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అదే ఊపుతో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. హైదరాబాదీ బిడ్డనని చెప్పుకుంటున్నముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ఈ నెల 12లోగా రాజీనామా చేయాలని, చేసిన రాజీనామాలను ఆమోదింపజేసుకోవాలని హరీశ్‌రావు సూచించారు. రాజీనామా చేయకుంటే ప్రజల్లో తిరగలేరని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ‘మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనండి. మీకు ఏ కష్టమొచ్చినా ఆదుకుంటా.’ అని యువతకు హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 12న జరిగే ‘ప్రజాగర్జన’కు లక్షలాదిగా తెలంగాణ అభిమానులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. 

Wednesday 7 September 2011

వరంగల్‌లో మంత్రి పొన్నాల ఇంటిని ముట్టడించిన కేయూ విద్యార్థులు - రెచ్చిపోయిన పోలీసులు.. 18 మందిపై కేసులు

- జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతూ చితకబాదారు
- కోర్టులో హాజరుపర్చాలన్న పాపానికి జిల్లా జాక్ చైర్మన్ పాపిరెడ్డి, టీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి, మరో నాయకుడు ఇండ్ల నాగేశ్వరరావు అరెస్టు 


Con-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaవరంగల్‌లో ఖాకీస్వామ్యం పడగవిప్పి బుసకొట్టింది. మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటిని ముట్టడించి, కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ఫ్లెక్సీని చించివేశారనే నెపంతో కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థి నేతలపైనా, విద్యార్థులపైనా పోలీసులు తమ ప్రతాపాన్ని చూపారు. మంత్రి ఇంటిపై విద్యార్థులు దాడి చేశారనే కారణంగా కేయూ విద్యార్థుల్ని జిల్లాలోని దాదాపు అన్ని పోలీసు స్టేషన్లు తిప్పుతూ చితకబాదుతున్నారు. విద్యార్థుల్ని కోర్టులో ప్రవేశపెట్టాలని కోరేందుకు వెళుతోన్న జిల్లా రాజకీయ జేఏసీ ప్రొఫెసర్ పాపిడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌డ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఇండ్ల నాగేశ్వరరావును రఘునాథపల్లి పోలీసు స్టేషన్‌లో అరెస్టు చేశారు.

విద్యార్థుల్ని కోర్టులో ప్రవేశపెట్టకుండా పోలీసులు అరాచకంగా వ్యవహరిస్తున్నారని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో అత్యంత ఉద్రిక్తంగా, తెలంగాణ కోసం ఉద్యమించే వారిపై ఉక్కుపాదం మోపేందుకే సర్కారు కుట్రచేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సకల జనుల సమ్మెలో భాగంగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కేయూ జేఏసీ, జిల్లా విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు మంగళవారం హన్మకొండ రాంనగర్‌లోని మంత్రి పొన్నాల ల ్మయ్య ఇంటిని ముట్టడించారు. విద్యార్థులు మంత్రి ఇంటి ఎదుట ై ఠాయించి చెప్పులు, బూట్లతో నిరసన తెలిపారు. తన మంత్రి పదవికి రాజీనామా చేసి సకల జనుల సమ్మెలో కలిసిరావాలని డిమాండ్ చేశారు.

అక్కడ బందోబస్తు నిర్తహిస్తున్న పోలీసుల కళ్లుగప్పిన కొందరు విద్యార్థులు మంత్రి ఇంట్లోకి దూసుకెళ్లి సోనియా ఫొటోఫ్లెక్సీని ధ్వంసం చేశారు. అలాగే ఇంటిపైకి రాళ్లు రువ్వి అద్దాలు పగులగొట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం మేరకు హన్మకొండ సీఐ వెంక సుబేదారి సీఐ రణధీర్, ఎసై్స రవికుమార్ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న విద్యార్థులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు విద్యార్థులను ఈడ్చుకెళ్లి జీపులో పడేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనలో 18 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు 12 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. వీరిలో కేయూ జాక్ చైర్మన్ సాధు రాజేష్, విద్యార్ధి నాయకుడు దేవోజీ నాయక్, కొంగర కిషోర్, శ్రీనివాస్‌డ్డి, మనోజ్, ప్రశాంత్, బాలకృష్ణ, అనిల్, కృష్ణ, సమన్, రాంమోహన్‌డ్డి, యాకూబ్‌డ్డి ఉన్నారు.

ఠాణాలు చుట్టూ తిప్పుతూ..
Wangal-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడాన్ని టీఆర్‌ఎస్ నేతలతో పాటు జేఏసీ, న్యాయవాదులు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు పలువురు సుబేదారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వారిని పరామర్శించారు. విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలని, లేకుంటే తక్షణమే వారిని కోర్టులో హాజరు పర్చాలని డిమాండ్ చేశారు. అరెస్ట్‌ను నిరసిస్తూ కేయూ విద్యార్థి నేతలు ఎస్డీఎల్‌సీఈ ఎదుట మంత్రి పొన్నాల దిష్టిబొమ్మను దహనం చేశారు. కాగా పోలీసులు విద్యార్థులను వైద్యచికిత్సల నిమిత్తం ఎంజీఎంకు తరలిస్తామని నచ్చజెప్పి ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.

ఈ విషయం టీఆర్‌ఎస్, విద్యార్థి సంఘాల చెవిన పడటంతో వెంటనే వారిని అక్కడ నుంచి జఫర్‌గఢ్ ఠాణాకు తరలించారు. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థులను చిత్రహింసలకు గురిచేసినట్లు తెలిసింది. వారిని విడిపించేందుకు టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌డ్డి, పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ పాపిడ్డి, టీఆర్‌ఎస్ యువజన నేత ఇండ్ల నాగేశ్వర్‌రావు జఫర్‌గఢ్‌కు వెళ్లగా అక్కడి నుంచి వారిని జనగామ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారనే సమాచారంతో వారిని అనుసరించగా ముగ్గురిని రఘునాథపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విద్యార్థుల్ని మాత్రం జనగామ తీసికెళుతున్నామని చెప్పి అక్కడి నుంచి మొదట లింగాల ఘనపురం అని ఆ తరువాత అక్కడా ఆందోళన జరుగుతోందని భావించి అక్కడి నుంచి దేవరుప్పులకు తరలించారు. అక్కడి నుంచి కొడకండ్ల పోలీసు స్టేషన్‌కు తీసికెళ్లారు. పోలీసుల వైఖరికి నిరసనగా ఓయూ క్యాంపస్‌లో విద్యార్థులు రాత్రి ధర్నా జరిపారు. పొన్నాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల అరెస్టుకు నిరసనగా గురువారం పోలీస్ స్టేన్ల ముట్టడికి పిలుపునిచ్చారు.

ప్రజాసంఘాల నిరసన
ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన విద్యార్థుల్ని పోలీసులు..నక్సలైట్లను పోలీసు స్టేషన్లు తిప్పినట్టు తిప్పుతూ భయాందోళనకు గురిచేస్తోన్నారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్యను రాజీనామా చేయాలని ముట్టడించే క్రమంలో జరిగిన చిన్నసంఘటనను ఆసరాగా చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం, పొన్నాల లక్ష్మయ్య కావాలని విద్యార్థుల్ని చితకబాదుతున్నారన్నారు.

విద్యార్థులకు రక్షణగా వెళుతోన్న తమనూ రఘునాథపల్లి పోలీసు స్టేషన్‌లో అరెస్టు చేయడాన్ని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ పాపిడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌డ్డి, టీఆర్‌ఎస్ యూత్‌నేత ఇండ్ల నాగేశ్వరరావును అరెస్టు చేశారు. ఈ అక్రమంగా అరెస్టు చేసినవారిని తక్షణమే కోర్టులో హాజరుపరచాలని తెలంగాణ ప్రజావూఫంట్ జిల్లా కన్వీనర్ రమాదేవీ, ఎపీసీఎల్‌సీ నేత అంబటి శ్రీనివాస్, రాష్ట్రబార్ కౌన్సిల్ మెంబర్ ఎం. సహోదరడ్డి, జిల్లా బార్ అధ్యక్షుడు రావు అమరేందర్‌డ్డి, టఫ్ బాధ్యులు ఎండి రియాజ్ సహా పలువురు డిమాండ్ చేస్తున్నారు.

విద్యార్థులు క్షేమంగానే ఉన్నారు: జిల్లా ఎస్పీ
తెలంగాణ ఉద్యమాన్ని ఆసరాచేసుకొని కొంతమంది క్రిమినల్ మెంటాలిటీతో విధ్వంసం చేయాలని చూస్తున్నారని, అటువంటి వారినే తాము అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ రాజేశ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం వారంతా తమ కస్టడీలో క్షేమంగా ఉన్నారని వారిని కోర్టులో ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. అయితే ఈ కేసులో మంత్రి పొన్నాల లక్ష్మయ్యకానీ, ఆయన అనుచరులు కానీ ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, తామే సూమోటాగా కేసు నమోదు చేశామనీ ఆయన స్పష్టం చేశారు.

అరెస్ట్ చేయడం తగదు: మల్లేపల్లి లక్ష్మయ్య
మంత్రి పొన్నాల ఇంటివద్ద ఆందోళన చేసినందుకు విద్యార్థులను అరెస్ట్ చేయడం తగదని రాజకీయ జేఏసీ కో- చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. తెలంగాణలో పుట్టి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పదవులకు రాజీనామా చేయాలని కోరితే అరెస్ట్ చేస్తారా? అని మండిపడ్డారు.

విమలక్క ఖండన
మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలోకి రావల్సిందిగా కేయూ విద్యార్థులు మంత్రి పొన్నాల ఇంటివద్ద ఆందోళన చేయడం ప్రజాస్వామ్యయుతమేనని, వారిని అరెస్టు చేసి, దమనకాండ సాగించడం ప్రజాస్వామ్యం కాదని తెలంగాణ ఐక్య వేదిక నాయకురాలు విమలక్క అన్నారు. కేయూ విద్యార్థులను పోలీసులు ఠాణాలు తిప్పుతూ గొడ్లను కొట్టినట్టు కొట్టడాన్ని ఖండించారు.

Tuesday 6 September 2011

తెలంగాణ రావడం మంత్రులకు ఇష్టం లేదు- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ

narayana-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema

 తెలంగాణ కోసం, జగన్ కోసం ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తీరు గుర్రానికి, గాడిదకు ఉన్నంత తేడా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా గోదావరిఖని, ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం రాజకీయ ప్రక్రియలో భాగమని, జగన్ కోసం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం అవినీతి, కుంభకోణాలను ప్రోత్సహించడమేనని అభివూపాయపడ్డారు.

రెండింటినీ ఒకే విధంగా పోల్చడం సరికాదన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన అడ్డంకి అని ధ్వజమెత్తారు. మంత్రులకు తెలంగాణ రావడం ఇష్టం లేదని, పైకి మాత్రం కావాలని అంటున్నారని ఆరోపించారు. దొంగచాటుగా విధులు నిర్వర్తించడమే దీనికి నిదర్శమన్నారు. 2004లో టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్నప్పటి నుంచి ప్రత్యేక రాష్ట్రాన్నిఏర్పాటు చేయకుండా కాంగ్రెస్ కాలయాపన చేస్తోందని, పచ్చి అవకాశవాద వైఖరి అవలంభిస్తోందని మండిపడ్డారు. ఏదో ఒక సాకు చెప్పి తెలంగాణ విషయాన్ని వాయిదా వేస్తున్నారని, అవినీతి, కుంభకోణాలు మాత్రం ఏ అడ్డూలేకుండా చేస్తూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. అణుఒప్పందంపై కేంద్రం మైనార్టీలో ఉన్నప్పటికీ తీర్మానం నెగ్గించుకుందని, తెలంగాణను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర సాధనలో సీపీఐ ముందువరుసలో ఉందని, భవిష్యత్‌లోనూ ఉంటుందని చెప్పారు.

సకల జనుల సమ్మెకు మద్దతుగా ఇప్పటికే కార్యక్షికమాలు చేపట్టామని, సింగరేణిలో సమ్మెను ఏ విధంగా ముందుకు తీసుకు విషయంలో చర్చిస్తున్నట్లు చెప్పారు. జేఏసీతో, గద్దర్, కోదండరాంలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. సకల జనుల సమ్మెకు మద్దతు ఉంటుందని ప్రకటించారు.

ఆస్తులు ప్రకటించాలని బాబును ఎవరడిగారు?
రాజకీయ, కార్పొరేట్ అవినీతి బయటకు రాకుండా బూర్జువా పార్టీలు అడ్డుపడుతున్నాయని, ప్రజల దృష్టిని మరల్చడానికే నాయకులు ఆస్తులను ప్రకటిస్తున్నారని విమర్శించారు. రాజకీయాల అక్రమంగా సంపాదించిన ₹73లక్షల కోట్లను స్విస్‌బ్యాంకుల్లో దాచుకున్నారని ఆరోపించారు. గంగిగోవుగా పేరొందిన ప్రధాని మన్మోహన్‌సింగ్ హాయంలోనే 2జీ స్ప్రెక్ట్రమ్, అదర్శ్, కామన్ కుంభకోణాల్లో ₹3లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. అవినీతిపై పోరాటం పేరుతో ప్రజల్లోకి వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును ఆస్తులను ప్రకటించాలని, ఎవరు అడిగారని ప్రశ్నించారు. అవినీతి ఆంశాన్ని పక్కదోవ పట్టించడానికే ఆస్తులు ప్రకటించారని ఎద్దేవా చేశారు. ప్రజావూపతినిధులు ప్రకటించిన ఆస్తులకు 60 రెట్లు అధికంగా చేసుకొని చదువుకోవాలన్నారు.

ఎప్పుడో 1983లో ₹90వేలతో హైదరాబాద్, తిరుపతిలలో తాను కోనుగోలు చేసిన రెండు స్థలాలు ప్రస్తుతం ₹65లక్షలకు చేరుకున్నాయని చెప్పారు. చంద్రబాబు తన ఆస్తుల వివరాల్లో ప్రస్తుత విలువ కాకుండా ఎప్పుడో ఉన్న విలువ ₹ 50 కోట్లుగా చూపించారని, వాస్తవానికి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఎంత ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. 90వేల పెట్టుబడి పెడితే తన విలువ ప్రస్తుతం 65 రెట్లు పెరిగిందని, ఈ లెక్కన బాబు ₹50కోట్లు పెట్టుబడి పెడితే 50ట్లు పెరిగి ప్రస్తుతం అతని ఆస్తులు ₹2500 కోట్ల వరకు ఉంటాయని వివరించారు. నాలుగేళ్ల కిందట ₹2కోట్ల ఆదాయపు పన్ను చెల్లించిన జగన్ ఇప్పుడు ₹400కోట్లు ఎలా చెల్లిస్తున్నాడు? అక్రమంగా సంపాదించడానేందుకు ఇంతకన్నా నిదర్శనం ఏకం కావాలని ప్రశ్నించారు.

అవినీతికి పాల్పడిన వారికి నార్కోఅనాలిసిస్ పరీక్ష చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని, పరీక్ష తాను కూడా సిద్ధమని ప్రకటించారు. సమావేశంలో సీపీఐ శాసన సభా పక్ష నేత గుండా మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటడ్డి, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య,సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి,బద్రి సత్యనారాయణ, కలవేన శంకర్, మల్లాడ్డి, వీరభవూదయ్య, ఖలేందర్‌ఖాన్ పాల్గొన్నారు.