పక్కలిరగ తన్నేందుకు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్కి
అధికారము ఎక్కడిది?
ప్రజాస్వామ్య రాజ్యాంగం
పరిపాలన గల దేశము
ప్రజామతము ప్రకటిస్తె
పట్టికొట్టి చంపేస్తద?
వేలు లక్షలు ప్రజలు
జేలుకేగ సిద్దపడితె
ఏర్పాట్లు చేయలేక
లారీÄచార్జి పరిపాలన?
కాడెద్దుల ధోరణిలో
కూడని పనియే లేదా?
విసిగి వేసారి జనం
హింసకాండ తలబెడితె
కేంద్రానిది బాధ్యతంత
‘ప్రెస్టేజి’ పేర హింస
ప్రభుత్వాన్ని సబబైతె
ప్రాణిధర్మ హింసకాండ
ప్రజలకు కూడా సబబే.
బ్రహ్మన్న చంపు చంపు
ఏ పాటి చంపుతావో
తూటాలు ఎన్నున్నయో
పల్చుకో, ఆబాలం గోపాలం
చంపు చంపు చంపు అనుచు
బరి రొమ్ములతో బజార్లో
తూటాలను ఎదురుతాన్రు.
ఒకటో రెండో వుంచకో
తుదకు ఆత్మహత్యకైన
అక్కరకొస్తె నీకు, లేకుంటే
ప్రాణాలతో ప్రజల చేతికే
చిక్కితే నీకున్నది కుక్కచావు.
తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త
భారతమాతాకీ జై
తెలంగాణ జిందాబాద్.
No comments:
Post a Comment