అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కుక్క పిల్ల, ఆడ పిల్ల, కవితకేది కాదు అనర్హం అని ఎవరో పెద్దమనిషి అన్నట్టు
మన రాజకీయ నాయకులు
వాళ్ళ రాజకీయాలు రాజీనామాలు
వాగ్ధానాలు వాదనలు
రోదనలు రొప్పులు నొప్పులు
సొమ్ములు సోకులు
ఇటువైపు...
పెరుగుతున్న ధరలు
ఎండుతున్న భూములు
ఏడుస్తున్న రైతులు
కారుతున్న చెమటలు
నిద్రలేని కన్నులు
పనిలేని నాగలి
పనికి రాని ప్రభుత్వ పథకాలు
అకాల చినుకులకు కారుతున్న ఇంటి కప్పులు
తెగిపోయిన పాత టైరు చెప్పులు
రాజ్యమేలుతున్న దోమలు
దరిద్రున్ని దోసుకుంటున్న దొంగలు
కరువు కాలుష్యం కటిక దరిద్రం
ఇంకోవైపు...
అంతులేని అడవులు
అంతు తేలని గనులు
అలుపెరుగని నదులు
అమాయకపు జీవులు
అందమైన కొండకోనలు
అపురూపమైన కట్టడాలు
కావేవి మన తెలంగాణ కవితకనర్హం
జై హొ జై హొ తెలగాణ కవిత్వమా...
కనీసం ఇన్నాళ్ళకు నీకు అక్షర రూపం ఇచ్చి కాగితం మీద అచ్చుకు నోచుకోకవోయినా...
ఇంటర్నెట్ పుణ్యమా అని అక్కడక్కడ బ్లాగులు వెలిసినయ్...
ఇంక నీకు నాకు పెండ్లయినట్టే...
యాడికి వోతే ఆడికి నా ఎంట గౌరవంగా... గర్వంగా తీస్కేల్తా...
నా పెళ్ళానికి సొమ్ములు సోకులు చూసుకున్నట్టే నిన్ను కూడా కొత్త పుంతలు తొక్కిస్తా...
ముస్తాబు చేసి ఈ నవ సమాజానికి నీ సోయగాలు హొయలు సూపిస్తా... నా దేశాన నాలుగు వందల భాషలున్డొచ్చు కాని తేనే లాంటి నా తెలంగాణ తీపి జూపిస్తా...
జై తెలంగాణ జై జై తెలంగాణ
శ్రీనివాస్ రెడ్డి కొంపల్లి
No comments:
Post a Comment