JAI TELANGANA

JAI TELANGANA
"PORADITHE POYEDEMI LEDU BANISA SANKELU TAPPA ANDUKE PORADI TELANGANA SADIDAM ATMAHATYALA THO KADU" JAI TELANGANA! JAI JAI TELANGANA!!

T-News

Friday 5 August 2011

డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడాలి: సుష్మా

తెలంగాణపై డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలని బీజేపీ నేత సుష్మాస్వరాజ్ డిమాండ్ చేశారు. సోనియాగాంధీ పుట్టినరోజు బహుమతిగా తెలంగాణ అని ప్రకటించిందని ఆమె అన్నారు. డిసెంబర్ 9 ప్రకటనను అన్ని పక్షాలు స్వాగతించాయన్నారు. న్ని ఆలోచించే తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు అమలు చేయటం లేదని ఆమె ప్రశ్నించారు.

తెలంగాణపై ప్రవేశపెట్టిన సావధాన తీర్మానంపై శుక్రవారం ఆమె మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రం కావాలంటూ వేలాదిమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. తెలంగాణ కోరుతూ 13మంది ఎంపీలు రాజీనామాలు చేశారన్నారు. గిర్‌గ్లానీ కమిషన్ సిఫార్సులు అమలు కాలేదని, ఫజలలీ కమిషన్ కూడా తెలంగాణ ఇవ్వాల్సిందేనని చెప్పిందని సుష్మా గుర్తు చేశారు. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన ఏడాదికే తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. షరతులతోనే తెలంగాణ ఆంధ్రాలో విలీనం అయ్యిందన్నారు.

రాష్ట్రపతి ప్రసంగంలోనూ తెలంగాణ ప్రస్తావన ఉందన్నారు. తెలంగాణ డిమాండ్‌తో బలిదానాలు కొనసాగుతున్నాయని ఆమె అన్నారు. తెలంగాణ డిమాండ్‌తో 11మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచారన్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ నివేదిక తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు. తెలంగాణ చరిత్ర సుదీర్ఘమైందని సుష్మా అన్నారు.

No comments:

Post a Comment