JAI TELANGANA

JAI TELANGANA
"PORADITHE POYEDEMI LEDU BANISA SANKELU TAPPA ANDUKE PORADI TELANGANA SADIDAM ATMAHATYALA THO KADU" JAI TELANGANA! JAI JAI TELANGANA!!

T-News

Friday, 5 August 2011

తెలంగాణ మా జన్మహక్కు : సర్వే

తెలంగాణ తమ జన్మహక్కు అని, తాను పక్కా తెలంగాణవాదినని ఎంపీ సర్వే సత్యనారాయణ అన్నారు. లోక్‌సభలో తెలంగాణ అంశంపై జరుగుతున్న చర్చలో ఆయన శుక్రవారం మాట్లాడుతు తెలంగాణ ప్రాంతం రగులుతోందని, విభిన్న ప్రకటనలతో ప్రజలను ఆందోళనలకు గురి చేస్తున్నారన్నారు.

తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. ఆత్మబలిదానాలను ఆపాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. తెలంగాణ నిప్పుల కుంపటిగా మారిందని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రమే సమస్యకు పరిష్కారమని సర్వే తెలిపారు.

అందరూ రాజీనామాలు చేస్తే తెలంగాణ అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తేది ఎవరని సర్వే ప్రశ్నించారు. పార్లమెంట్‌లో మాట్లాడేందుకే తాను రాజీనామా చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. రెండో ఎస్సార్సీ వేయటమంటే తేనెతుట్టను కదపటమేనన్నారు. గుర్ఖాలాండ్ ఫార్మూలా, ప్రాంతీయ బోర్డుల ఏర్పాటుతో తెలంగాణకు న్యాయం జరగదన్నారు.

తమకు హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కావాలని సర్వే అన్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక సుప్రీంకోర్టు తీర్పు కాదని ఆయన పేర్కొన్నారు. అందరితోనూ తమకు స్వాతంత్య్రం రాలేదని, ఎన్డీయే హయాంలో తెలంగాణ ఇస్తే ఈ తిప్పలు తప్పేవన్నారు.

No comments:

Post a Comment