-తెలంగాణకు అప్పుడు అడ్డం పొడుగూ రోశయ్యే
-తెలంగాణను అడ్డుకున్న కుటిల చాణక్యం
- చంద్రబాబుతో కలిసి కుట్ర రచన
- భూతద్దంలో సీమాంధ్ర కృత్రిమ ఉద్యమం
- కేంద్రానికి తప్పుడు నివేదికలు
- ఆర్టీఐ ద్వారా నమస్తే తెలంగాణకు కాపీలు
- బాబు డైరెక్షన్‌లో రాజీనామాల డ్రామా
- స్పీకర్ ఫార్మాట్‌కు భిన్నంగా లేఖల సమర్పణ
- ఆమోదం పొందే అవకాశమే లేదు
- అయినా గగ్గోపూత్తించిన రోశయ్య సర్కార్
- తీర్మానం కోసం కేంద్రం ఆదేశాలు బేఖాతర్
- నెగ్గే అవకాశాలు లేవంటూ విస్మరణ
- తెలంగాణ బలిదానాలు పట్టించుకోని కేంద్రం
- డిసెంబర్ 9 ప్రకటన నుంచి వెనుకడుగు
- అన్నింటా తానై నడిపిన కొణిజేటి
-తెలంగాణను అడ్డుకున్న కుటిల చాణక్యం
- చంద్రబాబుతో కలిసి కుట్ర రచన
- భూతద్దంలో సీమాంధ్ర కృత్రిమ ఉద్యమం
- కేంద్రానికి తప్పుడు నివేదికలు
- ఆర్టీఐ ద్వారా నమస్తే తెలంగాణకు కాపీలు
- బాబు డైరెక్షన్‌లో రాజీనామాల డ్రామా
- స్పీకర్ ఫార్మాట్‌కు భిన్నంగా లేఖల సమర్పణ
- ఆమోదం పొందే అవకాశమే లేదు
- అయినా గగ్గోపూత్తించిన రోశయ్య సర్కార్
- తీర్మానం కోసం కేంద్రం ఆదేశాలు బేఖాతర్
- నెగ్గే అవకాశాలు లేవంటూ విస్మరణ
- తెలంగాణ బలిదానాలు పట్టించుకోని కేంద్రం
- డిసెంబర్ 9 ప్రకటన నుంచి వెనుకడుగు
- అన్నింటా తానై నడిపిన కొణిజేటి
ఆయన.. తాను దారిన పోయే దానయ్యనని చెప్పుకుంటారు.. కానీ.. ఆయనది గూడుపుఠాణీల్లో అందెవేసిన చెయ్యి! తనకు గ్రూపు రాజకీయాలు తెలియవని అమాయక ముఖం పెడతారు.. కానీ.. ప్రతిపక్ష నేతతో సైతం కుమ్మక్కయ్యే చాతుర్యం ఆయన సొంతం! తనకు ఏ వాదమూ లేదని కుండబద్దలు కొడతారు.. కానీ.. తెలంగాణవాదమంటే ఆయనకు అణువణువునా వ్యతిరేకతే! ఉన్నది ఉన్నట్లు అధిష్ఠానానికి చెప్పానంటారు.. కానీ.. కనికట్టు చేసి.. లేనిదాన్ని ఉన్నట్టు చూపుతారు! ఆయన మాట్లాడుతుంటే ఒళ్లంతా ఎకసెక్కమే! ఆయన కుటిల చాణక్యం తెలంగాణ నోటికాడ కూడు తీసింది! ఆయన నడిపిన కుట్రల తంత్రాంగం.. సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రినే వెనుకడుగు వేయించింది! ఆయన పంపిన కపట నివేదికల సారాంశం.. నాలుగు దశాబ్దాల పోరాటం ఫలితాన్నివ్వబోతున్న అపురూప క్షణాలను కర్కశంగా చిదిమేసింది! పది మంది పోగైతే అదో పెద్ద ఆందోళన.. యాభై మంది తాపీగా నడిస్తే భారీ ర్యాలీ.. పది నిమిషాలు ట్రాఫిక్‌కు అడ్డంపడితే.. అల్లకల్లోలం చేసిన రాస్తారోకో! సీమాంధ్రలో జరిగిన ఆంధోళనలపై నివేదికల్లో అన్నీ వక్రీకరణలే! తెలంగాణను అడ్డుకునేందుకు దారికి అడ్డంపడిన ఆ దానయ్య... మాజీ ముఖ్యమంత్రి రోశయ్య! ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చక్రం తిప్పి.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలపై నీళ్లు చల్లిన ద్రోహి! ఆర్టీఐ ద్వారా నమస్తే తెలంగాణ సంపాదించిన కీలక డాక్యుమెంట్లు.. రోశయ్య సీమాంధ్ర దుర్నీతిని ఎండగడుతున్నాయి! తెలంగాణకు నెంబర్ వన్ విలన్ ఆయనేనని ప్రజా బోనులో నిలబెడుతున్నాయి!
హైదరాబాద్, ఆగస్టు 30 (టీ న్యూస్) :అవును.. తెలంగాణకు నెంబర్ వన్ విలన్ అప్పటి ముఖ్యమంత్రి.. కాబోయే తమిళనాడు గవర్నర్ రోశయ్యే! సీమాంధ్ర కపట సమైక్యవాదులతో కలిసి రోశయ్యే చేసిన అన్యాయమే తెలంగాణ రాష్ట్ర పాలిట శాపమైంది. డిసెంబర్ 9న రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం.. తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా రాష్ట్రాన్ని ఆదేశించింది. ఆ ఆదేశాన్ని ముఖ్యమంవూతిగా ఉన్న రోశయ్య అప్పట్లో తిరస్కరించారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. సభలో తీర్మానం నెగ్గే అవకాశాల్లేవన్న రోశయ్య.. అందుకే ప్రవేశపెట్టలేదని చెప్పారు. తెలంగాణ అంకురాన్ని అప్పుడే తుంచారు. ఉద్యమం వేర్లు కూడా పెరికేందుకు దాడిని మరింత ఉధృతం చేస్తూ.. కేంద్రానికి వరుస నివేదికలు పంపారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలుపెడుతున్నామని కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించిన రోజునే రోశయ్య ఢిల్లీ విమానాక్షిశయంలోనే చంద్రబాబునాయుడుతో 45 నిమిషాలపాటు మాట్లాడారు. అప్పుడే తెలంగాణను అడ్డుకునే కుట్రకు బీజం పడింది. ఒకవైపు ముఖ్యమంవూతిగా ఉన్న రోశయ్య తన పదవిని అడ్డం పెట్టుకుని సీమాంధ్ర ప్రాంతాల్లో జరిగిన కృత్రిమ ఉద్యమాన్ని మహోద్యమంగా చిత్రీకరిస్తూ కేంద్రానికి నివేదికలు పంపితే... మరోవైపు చంద్రబాబునాయుడు తన పార్టీకి చెందిన సీమాంధ్ర నాయకులతో రాజీనామా డ్రామాలు మొదలుపెట్టించారు. అప్పట్లో సీమాంధ్ర ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలకు సంబంధించి మీడియాలో ప్రసారమైన సన్నివేశాల్ని చూస్తేనే అవి కృత్రిమంగా నడిచిన కార్యక్షికమాలని స్పష్టమవుతుంది.
రాజీనామాల పేరిట సీమాంధ్ర ప్రజావూపతినిధులు ఒట్టి డ్రామానే చేశారన్నదానికి సరైన ఫార్మాట్‌లో వాళ్లు రాజీనామాలు చేయకపోవటమే నిలు నిదర్శనం. అయినా, కేంద్ర ప్రభుత్వం రోశయ్య తప్పుడు నివేదికలకు, చంద్రబాబు డైరెక్షన్‌లో సీమాంధ్ర నేతలు ఆడిన రాజీనామాల డ్రామాలకు తలొగ్గింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలుపెట్టామన్న ప్రకటన నుంచి చిదంబరం యూ టర్న్ తీసుకున్నారు.
అఖిలపక్షం ఓకే అన్నా..: డిసెంబర్ 9 ప్రకటనకు ముందు రోజు రాష్ట్ర రాజధానిలో అఖిలపక్ష సమావేశం జరిగింది. సీపీఎం మినహా అన్ని పార్టీలూ తెలంగాణకు సై అన్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై అసెంబ్లీలో తీర్మానం పెడితే మద్దతు ఇస్తామని దాదాపు అన్ని పార్టీలూ హామీ ఇచ్చాయి.
మజ్లిస్ తటస్థ వైఖరిని తీసుకుంది. ఓవైపు రాష్ట్ర సాధన కోసం దీక్ష చేస్తున్న కేసీఆర్ ఆరోగ్యం విషమిస్తుండటం.. మరోవైపు అన్ని పార్టీల సమావేశంలో ఏకాభివూపాయం వ్యక్తం కావడంతో డిసెంబరు 9న రాత్రి 11.35గంటలకు కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు ఢిల్లీలో ప్రకటించారు. తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. కానీ.. రోశయ్య మాత్రం తన సీమాంధ్ర కుటిలనీతిని ప్రదర్శించారు. సమైక్య విద్రోహాన్ని అమలు చేశారు. అదే రోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రోశయ్యను విమానాక్షిశయంలో మీడియా ప్రతినిధులు చిదంబరం ప్రకటన గురించి అడిగారు. దానికి రోశయ్య కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటన గురించి తనకేమాత్రం తెలియదని చెప్పారు. అప్పటి నుంచే తెలంగాణను అడ్డుకోవటానికి పావులు కదలపటం మొదలుపెట్టారు. కేంద్రం ఆదేశాలను ఖాతరు చేయకుండా.. తీర్మానం పెడితే నెగ్గదన్న వాదన తీసుకొచ్చి.. అసలా ఊసే లేకుండా చేశారు.
కేంద్రానికి తప్పుడు నివేదికలు మొదలు..
డిసెంబరు 19న రోశయ్య కేంద్ర హోంమంత్రి చిదంబరానికి రాష్ట్రంలోని పరిణామాల నివేదికను పంపించారు. స్వప్రయోజనాల కోసం లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివరావులాంటి కొందరు సృష్టించిన కృత్రిమ ఉద్యమాన్ని భూతద్దంలో పెట్టి చూపించారు. తెలంగాణపై కేంద్ర మంత్రి చిదంబరం చేసిన ప్రకటనకు నిరసనగా 2009 డిసెంబరు 18, 19 తేదీల్లో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగిందని నివేదికలో పేర్కొన్నారు.
వాస్తవానికి ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో జరిగిన రాస్తారోకోలు, ధర్నాలు, ఇతర ఆందోళన కార్యక్షికమాల్లో పట్టుమని యాభైమంది కూడా లేకున్నా.. 2.25 లక్షలమంది నిరసనల్లో పాల్గొన్నారంటూ (అంత కచ్చితంగా ఎలా లెక్కపెట్టారో ఆ రోశయ్యకే తెలియాలి) నివేదికలో వివరించారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో 1,141 ఆందోళన కార్యక్షికమాలు జరిగాయని, వీటిలో ర్యాలీలు, ధర్నాలు, ఆమరణ నిరాహారదీక్షలు, రైల్‌రోకోలు, రాస్తారోకో తదితర కార్యక్షికమాలు ఉన్నాయని నివేదించారు. ముప్పయిచోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయని, వీటిల్లో ప్రభుత్వ, ప్రజా ఆస్తుల విధ్వంసం జరిగిందంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో రెండు రోజులపాటు బంద్ జరిగిందని, తూర్పుగోదావరి జిల్లాతోపాటు చిత్తూరు, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 19న బంద్ జరిగిందని నివేదికలో తెలిపారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన సీమాంవూధలో అల్లకల్లోలం సృష్టించిందని సీన్ క్రియేట్ చేశారు.
దుష్టచతుష్టయం
అధికారపక్షంతో విపక్షం కుమ్మక్కయింది! చంద్రబాబు నాయుడు.. లగడపాటి రాజగోపాల్.. కావూరి సాంబశివరావు.. రాయపాటి సాంబశివరావు.. సకల తెలంగాణ వ్యతిరేకులంతా పొడిచిన పొద్దును.. చిదిమేసేందుకు వంచన పంచన చేరారు! ముందు రోజు అసెంబ్లీలో చేసిన తీర్మానాలు గాలికి కొట్టుకుపోయాయి. దొంగ రాజీనామాల డ్రామాలకు తెర లేచింది. రాష్ట్రం రాజకీయ సంక్షోభంలోకి వెళ్లిపోయిందంటూ సీమాంధ్ర చానళ్లు గగ్గోలు పెట్టాయి! మరుసటి రోజు నుంచే సీమాంధ్రలో కృత్రిమ ఆందోళనలు మొదలయ్యాయి! ప్రేరేపిత ఉద్యమాలకు ప్రాణం వచ్చింది! అక్కడి నుంచి తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రల అధ్యాయం పుటలు తెరుచుకుంది!!
లగడపాటి నిరాహారదీక్ష డ్రామా గురించి...
ఇక, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తోపాటు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన కొందరు నాయకులు ఆమరణ నిరాహారదీక్షలు కూడా మొదలుపెట్టారని రోశయ్య కేంద్రానికి పంపిన త నివేదికలో తెలిపారు. లగడపాటి రాజగోపాల్, దేవినేని ఉమామహేశ్వరరావు, వై.ఎస్.వివేకానందడ్డిలను ఆస్పవూతులకు తరలించామని వివరించారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఆమరణ నిరాహారదీక్ష అంటూ డిసెంబరు 14న విజయవాడలో హల్‌చల్ చేసిన లగడపాటి రాజగోపాల్ దీక్ష మూడో రోజు కూడా చేరకముందే అనారోగ్యం పేరుతో ఆస్పవూతిలో చేరారు. ఆ తరువాత డిసెంబరు 20న రాత్రి 10గంటలకు హాస్పిటల్ నుంచి తప్పించుకుని నాటకీయఫక్కీలో హైదరాబాద్ చేరుకున్నారు.
నిమ్స్ ఆస్పత్రి లోపలికి పరుగులు తీస్తూ మీడియా కంట చిక్కారు. ఆమరణ నిరాహారదీక్ష చేసి అనారోగ్యానికి గురైన లగడపాటి రాజగోపాల్ ట్రాక్‌సూట్‌లో అథ్లెట్‌లా పరుగెత్తిన దృశ్యాలు చూసి అసలు విషయం అందరికీ అవగతమైంది. తాను నిరాహార దీక్ష ఎప్పుడో విరమించానని స్వయంగా రాజగోపాలే చెప్పుకున్నారు. మరో వింతేమిటంటే దేవినేని ఉమామహేశ్వరరావు, వై.ఎస్.వివేకానందడ్డిలు చికిత్స తీసుకోవటానికి నిరాకరించారని... ఆస్పవూతుల్లో దీక్షలు కొనసాగించారని రోశయ్య తన నివేదికలో పేర్కొన్నారు. కడప జిల్లాల్లో 48గంటలపాటు బంద్ జరిగిందని, చిత్తూరులో 24గంటలపాటు బంద్ జరిగిందని వివరిస్తూ నిరసనకారులు బీఎస్‌ఎన్‌ఎల్ ఎక్స్‌ఛేంజ్, తహసీల్దార్ కార్యాలయం, ఆర్‌అండ్‌బీ అతిథిగృహం, ఓ ప్రభుత్వ జీపును వివేకానందడ్డి అనుచరులు ధ్వంసం చేశారని నివేదికలో వివరించారు. డిసెంబరు 19న కడప జిల్లాలో రైల్‌రోకోలు జరిగాయని, కృష్ణా జిల్లాలో రాస్తారోకోలు జరిగాయని పేర్కొన్నారు.
పోటీగా...
తెలంగాణపై కేంద్ర సానుకూలంగా ప్రకటన చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవటంతోపాటు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపేందుకు డిసెంబరు 20న సభను నిర్వహించాలని నిర్ణయించారని, దీనికి రెండులక్షల జనాన్ని సమీకరించే ఏర్పాట్లు చేస్తున్నారని రోశయ్య తన నివేదికలో తెలిపారు. దీనికి పోటీగా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ప్రజా ప్రతినిధులు డిసెంబరు 21, 22 తేదీల్లో తమ తమ పదవులకు రాజీనామాలు ఇచ్చే విషయమై చర్చించేందుకు సమావేశం పెట్టుకోవాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. ఇక, డిసెంబరు 20నే టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ భవన్‌లో 21వ తేదీ నుంచి ప్రారంభించాలనుకున్న బస్సు యాత్ర గురించి పొలిట్‌బ్యూరో మీటింగ్‌ను పెట్టుకున్నట్టుగా తెలిపారు.
డిసెంబరు 20నాటి...
ఇక, డిసెంబరు 20నాటి పరిణామాలపై రోశయ్య మరో నివేదికను చిదంబరానికి పంపిస్తూ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తెలంగాణపై వచ్చిన ప్రకటనకు వ్యతిరేకంగా నిరసనలు, హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో 670 నిరసన కార్యక్షికమాలు జరిగాయని, వీటిల్లో ర్యాలీలు, ధర్నాలు, ఆమరణ నిరాహారదీక్షలు, రైల్‌రోకోలు, రాస్తారోకోలు ఉన్నాయన్నారు. ఈ ఆందోళనల్లో 86వేలమంది (మరోసారి ఇంత కచ్చితంగా నిరసనకారులను ఎలా లెక్కబెట్టారో?) పాల్గొన్నారని వివరించారు.
ఒక్క కడప జిల్లాలోనే 22 హింసాత్మక సంఘటనలు జరిగాయని తెలిపారు. నిరసనకారులు పులి నాలుగు లారీలు, రెండు జీపులకు నిప్పు పెట్టారని, కడప జిల్లాలోని లింగాల ప్రాంతంలో ఎయిర్‌టెల్, టాటా ఇండికాం, బీఎస్‌ఎన్‌ఎల్ సెల్‌టవర్లను కూడా దహనం చేశారని పేర్కొన్నారు. ఇదంతా వై.ఎస్.వివేకానందడ్డిని ఆస్పవూతికి తరలించటం వల్ల జరిగిందని, ఈ సంఘటనల్లో 7కోట్ల రూపాయల ఆస్తినష్టం జరిగిందని వివరించారు. దాంతోపాటు కడప, చిత్తూరు జిల్లాల్లో 72గంటలపాటు బంద్ జరిగిందని తెలిపారు. కృష్ణ, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా బంద్ జరిగిందని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మందా జగన్నాథం, మధుయాష్కి, వీ హనుమంతరావు, కే రాజగోపాల్‌డ్డి, నంది ఎల్లయ్య, గుత్తా సుఖేందర్‌డ్డి, రాజయ్య, పొన్నం ప్రభాకర్, బలరాం నాయక్‌లు సమావేశమయ్యారని తెలిపారు.
పన్నులు చెల్లించవద్దంటూ...
ఇక, కృష్ణా జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ సమైక్యాంధ్ర డిమాండ్‌తో టోల్‌టాక్స్ చెల్లించవద్దంటూ పిలుపునిచ్చిందని రోశయ్య నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు నిజామాబాద్‌లోని తెలంగాణ వర్సిటీ విద్యార్థి జేఏసీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేవరకు పన్నులు చెల్లించవద్దంటూ పిలుపునిచ్చారని తెలిపారు. ఈ నివేదికలు డిసెంబర్ 19 - 21తేదీల మధ్య చిదంబరానికి అందాయి. ఆ తర్వాత రెండు రోజులకే కేంద్రం తెలంగాణ ఏర్పాటుపై ఇచ్చిన ప్రకటనను వెనక్కు తీసుకుంది. మళ్లీ డిసెంబర్ 23వ తేదీన రాత్రిపూట విలేకరుల ముందుకొచ్చిన చిదంబరం.. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు మారాయని, దీనిపై రాజకీయ పార్టీల మధ్య తీవ్ర భేదాభివూపాయాలు వచ్చాయని సెలవిచ్చారు. అందువల్ల అన్ని రాజకీయ పార్టీలతో విస్తృత స్థాయి చర్చలు ప్రారంభిస్తామంటూ నీళ్లు చల్లారు. తెలంగాణను అడ్డుకున్న సూత్రధారి రోశయ్య... అనంతరం కాలంలో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. కేంద్రం పట్ల అతి విధేయత కనబరుస్తూ ఇప్పుడు తమిళనాడు రాజ్‌భవన్‌లో విశ్రాంతికి వెళుతున్నారు!!
http://www.namasthetelangaana.com/